తాడిపత్రి మండలంలోని గన్నెవారిపల్లి కాలనీలో ఉంటున్న వివాహిత జయమ్మ (28) చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందిందని రూరల్ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. మూడు రోజుల క్రితం అప్పు విషయమై భర్త ధనుమయ్యతో గొడవపడి ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిందన్నారు. బంధువులు ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందింది. వారికి పిల్లలు ఉన్నారన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.