చీమకుర్తి మండలం చంద్రపాడులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆరుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 50, 500ల నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు చీమకుర్తి సీఐ సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీమకుర్తి మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని సీఐ హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa