ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైల్లోనే ప్రేమ జంట రొమాన్స్

national |  Suryaa Desk  | Published : Sat, Jul 20, 2024, 12:23 PM

ప్రస్తుత సమాజంలో ప్రేమ జంటలకు అడ్డు అదుపులేకుండా పోతుంది. కాసింత ఖాళీ ప్లేస్ దొరికితే చాలా రొమాన్స్‌కు తెరలేపుతున్నారు.పక్కన ఎవరున్నా.. ఇతరులు చూస్తున్నారనే భయం లేకుండా కొంతమంది పబ్లిక్‌గానే తమ పని కానిచ్చేస్తున్నారు. ఇటీవల మెట్రో రైల్లో యువత ప్రవర్తన మరీ మితిమిరిపోతోంది. అయితే తాజాగా ఓ జంట రైల్లోనే దుకాణం మొదలుపెట్టింది. ఒకే సీటులో ఇద్దరు పడుకుని గలీజ్‌గా ప్రవర్తించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట లీక్‌ అవ్వగా.. నెటిజన్లు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. సిగ్గు లేకుండా వ్యవహరించిన ఆ జంటపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఓ జంట రైల్వే కోచ్‌లో రొమాన్స్ చేసుకుంటున్న వీడియో బాగా వైరల్ అవుతోంది. వారు బరితెగించి ప్రవర్తిస్తున్న సమయంలోనే టీటీ అక్కడికి వచ్చారు. వారికి వార్నింగ్ ఇచ్చినా వెళ్లిన మారలేదు. అలానే పబ్లిక్‌గా కౌగిలించుకుని పడుకున్నారు. పక్క సీట్లోకి మహిళలు, చిన్న పిల్లలు వచ్చినా.. మనోళ్లు మాత్రం వెనక్కి తగ్గలేదు. వీరి వ్యవహారాన్ని ఎవరో తీసి నెట్‌లో పోస్ట్ చేశారు. ఓయో సదుపాయం ఇప్పుడు భారతీయ రైల్వేలో కూడా అందుబాటులో ఉందంటూ ఓ నెటిజన్ ఈ వీడియోను పోస్ట్ చేస్తూ రాసుకొచ్చారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com