మంగళగిరి మండలం కురగల్లు లో విద్యుత్ షాక్ కు గురై ఐదు పాడెగేదెలు మృతి చెందాయి. గేదెలు నీరుకొండకు చెందిన తోట వెంకటేశ్వరరావుకు చెందినవిగా గుర్తించారు. విద్యుత్ వైర్లు తెగి క్రిందపడి ఉండటంతో అటుగా శుక్రవారం సాయంత్రం గేదె లు వెళ్లిన నేపథ్యంలో ప్రమాదవశాత్తు విధ్యుద్ఘాతానికి గురై మృతి చెందాయని గేదెలు తిరిగి రాకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. వీటి ఖరీదు సుమారు రూ. 7 లక్షలు ఉంటుందని తెలిపారు.