ఆముదాలవలస మండలం కోర్లకోట, చీమలవలస, నెల్లిపర్తి, కట్యాచార్యులపేట గ్రామాలలో పంట క్షేత్రాలను శనివారం సందర్శించినట్లు ఎంఏఓ మెట్ట మోహన్ రావు తెలిపారు. వరి నారు మడిలో 5 సెంటలకు ఒక కేజీ యూరియా+1 కేజీ పొటాష్ లేదా మల్టీ కే5 ఒక లీటర్ నీటిలో 100గ్రాములు కలిపి పిచికారీ చేయాలని సూచించారు. వరి ఏద పొలాల్లో ఏకరకు మొదటి విడత ఎరువులను అనగా(50కేజీ డిఎపి + 15కేజి యూరియా+15ఎమ్ఓపి ఒక ఎకరాకు) వేసుకోవాలని కోరారు.