శింగనమల నియోజకవర్గంలో పలు ప్రభుత్వ వసతి గృహాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. నిరుపేద విద్యార్థులు మంచి చదువులు చదువుకోవడానికి వసతి గృహాలు ఎర్పాటు చేయడం జరిగింది. అయితే అవన్ని అధ్వాన్న స్థితిలో వున్నా ఎవరు పట్టించుకోవడం లేదని మంగళవారం ఎస్ఎఫ్ఐ నాయకులు మండిపడుతున్నారు. నార్పల మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంను ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి రాచేపల్లి సూర్య ప్రకాష్ పరిశీలించారు.