రైల్వేకోడూరు పట్టణంలోని నరసరావుపేట వీధిలో డ్రైనేజ్ రిపేరు చేసి నెల రోజులైనా పంచాయతీ అధికారులు డ్రైనేజీపై మూత పెట్టలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మ్యాన్ హోల్ కి మూత పెడితే బాగుంటుంది. పొరపాటున పిల్లలు ఆడుకుంటూ బండలు తీసేస్తే ప్రమాదాలు జరగవచ్చని, పంచాయతీ అధికారాలకు చెబుతున్నా పట్టించుకోవటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మూత ఏర్పాటు చేయాల్సిందిగా వారు కోరారు.