ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం రాష్ట్రమంతటా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం రాజంపేట జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో ఒంటిమిట్ట సర్కిల్ లో గ్రామస్థులు, జనసేన నాయకులు, జనసైనికుల సమక్షంలో మహిళలు, యువత, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని సభ్యత్వ నమోదు చేసుకున్నారు.