నంద్యాల పట్టణంలో కరెంటు షాక్ తో న్యాయవాది శివరాం బుధవారం ఉదయం మృతి చెందాడు. న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాది శివరాం స్నానం కోసం హీటర్ వేస్తుండగా కరెంటు షాక్ తగిలి ఘటన స్థలంలోనే మృతి చెందాడని తెలిపారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించారు. మూడు పదుల వయస్సులోనే శివరాం అకాలమరణం చెందడం మాకెంతో బాధాకరంగా ఉందని న్యాయవాదుల సంఘం ప్రతినిధులు తెలిపారు. వారికి నివాళులు అర్పించారు.