ఏలూరు జిల్లా నూజివీడు మండలంలోని బోర్వంచలోని గ్రామ సచివాలయ భవనం శిలాఫలకాన్ని కార్యకర్తలు సోమవారం రాత్రి ధ్వంసం చేసారు అని వైసీపీ నాయకులు వాపోతున్నారు. సచివాలయం గోడకు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి దానిపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, ఎంపీ కోటగిరి శ్రీధర్ల ఫొటోలను ఏర్పాటు చేశారు. పచ్చమూకలు శిలాఫలకంపై ఉన్న వైఎస్ జగన్, మేకా ప్రతాప్ ఫొటోలను పగులగొట్టారు. దీనిపై వైఎస్సార్సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇదే సచివాలయం కిటికీ అద్దాలను పగులకొట్టారని, దీనిపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఇంతవరకు కేసు కూడా నమోదు చేయలేదని మండిపడ్డారు.