తెలుగుదేశం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఒకసారి చరిత్ర తిరగేయాలి.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారపక్షానికి ఎలా సహకరించాలో తెలుసుకోవాలని సూచించారు. 2017లో విశాఖపట్నంలో పారిశ్రామిక సదస్సు జరుగుతున్నప్పుడు జగన్ ధర్నాచేశారన్నారు. గాయపడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చికిత్స జరిగిందని అందరూ అనుకుంటున్నారని, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.