ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలెండర్‌లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదని మంత్రి నాదేండ్ల మనోహర్ అన్నారు. అయితే 2016 నుంచి 24 వరకూ ప్రధాన మంత్రి ఉజ్వల యువజనం పథకం కింద కొంతమందికి ఇస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎంయూఐ పథకం కింద మొదటి ఉచిత ఎల్పీజీ కనెక్షన్, సిలండర్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా మా మ్యానిఫెస్టోలో మహిళలకు ఉచిత గ్యాస్ సలెండర్‌లకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఉచిత గ్యాస్ సిలెండర్ గురించి త్వరలో నిర్ణయం తీసుకొని వివిధ శాఖలతో చర్చించి సభా ముఖంగా మరోసారి వివరాలు తెలియజేస్తామన్నారు. రాష్ట్రంలో త్వరలోనే 674 కోట్లు ధాన్యం బకాయిలు రైతులకు అందిచాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. గతంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలను రైతు సహయ కేంద్రాలుగా మార్చుతున్నామని నాదేండ్ల మనోహర్ తెలిపారు.