హాస్టల్స్ పనితీరుపై నిరంతర నిఘా నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ నిబంధనల మేరకు పనిచేయాల్సిందేనని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారిణి పి.జ్యోతిలక్ష్మీదేవి పేర్కొన్నారు. ఆలమూరు ప్రభుత్వబాలుర హాస్టల్‌ను మంగళవారం రాత్రి ఆమె తనిఖీచేశారు. జిల్లాలోని హాస్టళ్లలో వార్డెన్ల కొరత ఉండటంతో ఒక్కో అధికారికి రెండు, మూడు హాస్టళ్ల బాధ్యతలు అప్పగించాల్సి వస్తోందన్నారు. రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు హాస్టల్ వార్డెన్ సూర్యనారాయణమూర్తి పాల్గొన్నారు.