అమరావతి అభివృద్ధి ఆగదని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని గ్రామాలైన వెంకటపాలెం, మందడంలో సిటీస్ ఛాలెంజ్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తున్న పనులను ఆయన పరిశీలించారు. వెంకటపాలెంలో అంగ్‌వాడీ సెంటర్ , ఈ-హెల్త్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని, మందడంలో మూడు అంగన్వాడీ సెంటర్లలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం 2019లో రెండో దఫా వచ్చి ఉంటే అమరావతి ప్రపంచంలో మొదటి ఐదు నగరాల్లో ఒకటిగా ఉండేదన్నారు. కాని మన దురదృష్టం కొద్ది వైసీపీ ప్రభుత్వం వచ్చి అమరావతిని నాశనం చేసిందన్నారు. అయినా వీలైనంత త్వరగా అమరావతి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. అమరావతిని టాప్ ఒన్‌గా ఉండేలా చేద్దామని రూ.41 వేల కోట్లతో అప్పట్లో పనలు చేపట్టగా ప్రభుత్వ మారడంతో అవన్నీ ఆగిపోయాయని గుర్తు చేశారు. మంగళగిరి తాడికొండ నియోజకవర్గ పరిధిలోని 24 గ్రామాల్లో సిటీ ఛాలెంజ్ ప్రాజెక్టులో 14 ప్రభుత్వ పాఠశాలు, 17 అంగన్వాడీ సెంటర్లు, అత్యాధునిక పర్యావరణ శ్మశానవాటిక నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. రూ.80.70 కోట్లతో చేపట్టిన ఈ పనులన్నీ ఆగస్టు చివరికి పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ ఐదు కోట్ల మంది ప్రజా రాజధాని అమరావతి అభివృద్ధి శరవేగంగా కొనసాగుతుందన్నారు. జంగిల్ క్లియరెన్స్ పనులు ఈ నెల 25 నుంచి శరవేగంగా జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సీఆర్డీఏ కమిషనర్ కాటమనేన భాస్కర్, అడిషనల్ కమిషనర్ సింహాచలం తదితరులు పాల్గొన్నారు.