శ్రీకాకుళం జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ గా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫర్మాన్ అహ్మద్ ఖాన్ శుక్రవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఆయనకు కార్యాలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ సిబ్బందిని జాయింట్ కలెక్టర్ పరిచయం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లాలో జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహించి జిల్లాకు బదిలీపై వచ్చారు.