ఎచ్చెర్ల నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది కొరత ఎక్కువుగా ఉందని, దీనిపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు కోరారు. అమరావతిలో శుక్రవారం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన మౌలిక సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని, మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేయాలన్నారు.