ఏపీలో జరుగుతున్న దాడుల పైన మాజీ సీఎం జగన్ ఢిల్లీలో ధర్నా చేసారు. ఆ సమయంలోనూ లోకేష్ రెడ్‌బుక్ గురించి విమర్శలు చేసారు రెడ్‌బుక్ పేరుతో అధికారులను..పార్టీ నేతలను భయపెడుతున్నారని ఆరోపించారు.ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు రెడ్ బుక్ పైన చర్చ జరుగుతోంది.రెడ్‌బుక్ పేరుతో హోర్డింగ్స్ ఏర్పాటు చేసారని చెప్పుకొచ్చారు. దీని పైన మంత్రి లోకేష్ స్పందించారు. జగన్ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్‌బుక్‌లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నానని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ఇంకా రెడ్‌బుక్ తెరవక ముందే జగన్ దిల్లీకి వెళ్లి గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్ల కాలంలో జగన్ 2 ప్రెస్మీట్లు పెడితే 11 సీట్లు వచ్చాక నెల రోజుల వ్యవధిలో 5 ప్రెస్మీట్లు పెట్టారని విమర్శించారు. జగన్ చెప్పే అబద్దాలేవో అసెంబ్లీకి వచ్చి చెప్తే వాస్తవాలను తాము వివరిస్తాం కదా అని నిలదీశారు. జగన్ అసెంబ్లీకి వస్తే గౌరవంగా చూసుకుని వాస్తవాలు అర్ధమయ్యేలా వివరిస్తామన్నారు.