శ్రీకాకుళం పరిధిలోని బట్టేరు నది నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతుండడంతో వీఆర్వోల ప్రత్యేక బృందం ఇసుక లారీని పట్టుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో వీర్వోలతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు శనివారం వేకువ జామున వీఆర్వోల బృందం ఇసుక అక్రమ రవాణా జరిగే ప్రాంతాలను పరిశీలిస్తుండగా బట్టేరు నది నుంచి ఉదయం 6 గంటలకు ఇసుకను విశాఖ తరలిస్తున్న లారీని గుర్తించింది. ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తుండడంతో లారీని, రాజాన అర్జున్‌ను పెద్దపాడు పోలీసులకు అప్పగించారు. అలాగే మైన్స్ అధికారులకు నివేదిక అందిం చారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న వారిలో పొన్నాం వీఆర్వో గణేష్, అలికాం, బైరి వీఆర్వోలు యశ్వంత్, రవితేజ, లక్ష్మణరావు ఉన్నారు.