శనివారం రాత్రి కూటమి ఎంపీలతో చంద్రబాబు విందు సమావేశం ఏర్పరిచారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ..... జగన్ సీఎంగా ఉన్న సమయంలో తామెప్పుడూ ఈ విధంగా కలసి కూర్చొని భోజనం చేయలేదని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. జగన్‌ను కలుసుకోవడమే కష్టంగా ఉండేదని చెప్పారు. ‘‘మీరు ఢిల్లీ వచ్చిన ప్రతిసారీ మీతో కూర్చుని భోజనం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. మీరు మా నియోజకవర్గం గురించి, పార్లమెంట్లో జరుగుతున్న పరిణామాల గురించి అడగడం మాకెంతో ప్రోత్సాహకరంగా ఉంది’ అని సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు స్పందిస్తూ... ‘ఢిల్లీ అంటే నాకు మీరే కదా, ఇక్కడ మీరే రాష్ట్రానికి కళ్లూ, చెవులు’ అని అన్నారు. ప్రతి ఎంపీతోనూ ఆయన పార్లమెంట్ సమావేశాల గురించి చర్చించారు. ఎంపీలు అందరూ అల్పాహారం తీసుకోవడం చూసి.. ‘డైటింగ్ చేస్తున్నారా?’ అని ఛలోక్తి విసిరారు. ‘ఇదీ మంచిదే.. తక్కువ తినాలి.. ఎక్కువ పనిచేయాలి’ అని నవ్వుతూ అన్నారు. రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాలు అధునాతనంగా అభివృద్ధి జరిగేలా చూడాలని తన పక్కనే కూర్చున్న పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడుకి చంద్రబాబు సూచించారు.