జగన్ ప్రభుత్వ హయాంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన భూ దందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, మదనపల్లిలో రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా బాధితుల ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారని తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన అమరావతి, అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. అక్రమాలు బయటపడతాయని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేశారని విమర్శించారు. ఘటనలో గత ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు తేలిందని.. పెద్దిరెడ్డి ముఠా పేదల భూములు కొట్టేసిందని, సిగ్గులేకుండా జగన్ ఢీల్లీలో ధర్నా చేశారని సోమిరెడ్డి దుయ్యబట్టారు.