మదనపల్లె స్థానిక సబ్ కలెక్టరేట్‌లో ప్రభుత్వ రికార్డులు దహనం చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి.ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. శనివారం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సీపీఐ నాయకులతో కలిసి ఆయన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...... మదనపల్లె రెవెన్యూ డివిజన పరిధిలో రెవెన్యూ అధికారులు భూకబ్జాదారులు కలిసి రాజకీయ నాయకుల అండతో వెయ్యి ఎకరాలపైగా అక్రమణ చేసి వాటికి ఫేక్ రికార్డులు సృష్టించారన్నారు. 22ఏ రికార్డులను గోల్‌మాల్ చేశారని ఈ నేపథ్యంలోనే వారు ప్రభుత్వ రికార్డులు పూర్తిగా దహనం చేశారని ఆరోపించారు. ఈ సంఘటనకు వెనుకు ఏ రాజకీయ పార్టీ నాయకులు ఉన్నా పార్టీలకు అతీతంగా దర్యాప్తు నిర్వహించి దోషులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ సర్థుబాటు చర్యల్లో భాగంగా రెడ్ బుక్‌లో పేజీలు చింపవద్దని ప్రభుత్వాన్ని కోరారు. మదనపల్లె, పుంగ నూరు. తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో వేల ఎకరాలు అక్రమణలకు పాల్పడారన్నారు. గతంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా పై సమగ్రవిచారణ జరపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కృష్ణప్ప, సాంబశివ, మదనపల్లె నియోజకవర్గ కార్యదర్శి మురళి, మాధవ్‌రెడ్డి, తిరుమల, కమలాకర్, శ్రీనాథ్, రాహుల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.