గోదావరి వరద మళ్లీ పెరుగుతోంది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53 అడుగులు దాటడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల శాఖ వెల్లడించడంతో కుక్కునూరు, వేలేరుపాడు, పోలవ రం, పెనుగొండ, ఆచంట, యలమంచిలి గోదావరి తీర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. కుక్కునూరు గ్రామ శివారులోకి వరద నీరు ముంచుతోంది. ఇక్కడి వారిని కివ్వాక పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళాలని అధికా రులు ఆదేశించారు. పుల్లప్పగూడెం సమీపంలోకి గోదా వరి వరద వచ్చి చేరింది. వెంకటాపురం ఎస్సీ కాలనీకి వెళ్లి రహదారిలో గోదావరి వరద నీట మునిగింది. గోదావరి మరింత పెరిగితే గొమ్ముగూడెం పంచాయతీ లోని ఉప్పర మద్దిగట్లతోపాటు ఆంబోతులగూడెం, చెరు వు కొమ్ముగూడెం గ్రామాలు ముంపు బారిన పడను న్నాయి. వారం రోజులుగా వేలేరుపాడు మండలంలోని 30 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. గోదావరి ఉపనది తాళిపేరుకు వరద పోటెత్తడంతో లక్షా 20 వేల క్యూసెక్కుల నీటిని దిగువన వున్న గోదావరిలోకి వది లారు. తెలంగాణలోని గోదావరి పరివాహక జిల్లాలైన భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, నిర్మల్ తదితర జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు కారణంగా వరద నీరు గోదావరికి పోటెత్తుతోంది. ఈ జిల్లాలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. భద్రాచలం వద్ద నీటిమ ట్టం 57 అడుగులకు చేరుకుంటే వేలేరుపాడులో వరద నీరు ఇళ్ళలోకి ప్రవేశిస్తుంది. ఇప్పటికే సంత మార్కెట్ సెంటర్‌లోని ఇళ్లలోకి నీరు ప్రవేశించటంతో వాటిని ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రస్తు తం వరద మండల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. జల దిగ్భందంలో చిక్కుకున్న 30 గ్రామాలతోపాటు మరికొన్నింటిని వరద చుట్టుముట్టే ప్రమాదం ఉండటంతో అధికారులు అక్కడి ప్రజలను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. 53 అడుగులకు చేరుకో గానే 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేయడంతో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి వేలేరుపాడులోనే ఉండి వరద పరిస్థి తిని సమీక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. పోలవరంలో గోదావరి నీటిమట్టం శుక్రవారం సాయం త్రానికి స్పల్పంగా పెరిగి 24.027 మీటర్లకు చేరుకుంది. ధవళేశ్వరం వద్ద 24.42 మీటర్లకు చేరింది. 13 లక్షల క్యూసెక్కుల వరద జలాలు దిగువకు విడుదల చేసిన ట్లు, రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు ధవళే శ్వరం బ్యారేజి డీఈఈ రమేష్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా 11,64,264 క్యూసెక్కుల వరద జలాలు దిగువకు విడుదల చేశారు. పట్టిసీమ ఎత్తిపో తల పథకం నుంచి కుడి కాలువకు 15 పంపులతో 5,310 క్యూసెక్కుల జలాలు విడుదల చేశారు.