చాపాడు మండలం పెద్దచియ్యపాడు గ్రామంలో ఆదివారం గంగమ్మ తల్లి జాతరలో నల్లబోయిన కుటుంబ సభ్యులందరూ కలిసి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా యాదవ సంఘం సభ్యులు మాట్లాడుతూ. ప్రతి ఏటా ఆషాఢమాసంలో నల్లబోయిన కుటుంబ సభ్యులందరూ అమ్మవారి సన్నిధిలో కలుసుకోవాలని, ఆలయ అభివృద్ధికి దోహదపడాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో పాతపాలెం, కొత్తపాలెం, పోట్లదుర్తి, కానపల్లి, మనారంపల్లి, గాంధీనగరం గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.