తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టరెట్లో ఫైళ్ల దహనం కేసు దర్యాప్తులో ఏపీ పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే పలు కీలక విషయాలు వెలుగు చూడగా.. ఇప్పుడిప్పుడే సూత్రదారులు ఎవరు..? పాత్రదారులు ఎవరు..? అనేది తేల్చే నిమగ్నమయ్యారు. తాజాగా పెద్దిరెడ్డి పీఏ శశికాంత్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఇక మిగిలింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్కడేనని, ఆయన ఇంట్లో సోదాలు చేసి విచారణ కూడా చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.