ఆముదాలవలసకు చెందిన కవి కుప్పిలి వెంకట రాజారావుకు కాకినాడకు చెందిన సాహిత్య వేదిక ఆదివారం పి ఆర్ జి బాలికొన్నత పాఠశాలలో ప్రశంసా పత్రం పురస్కారం అందజేసింది. లేత చేతులకు ఊతం" అనే కవితకు ఈ పురస్కారం లభించినట్లు ఆయన పేర్కొన్నారు. వెంకట రాజారావు కవితలకు గతంలో కూడా అనేక పురస్కారాలు లభించాయి. ఆముదాలవలసకు చెందిన పలువురు సాహితీవేత్తలు కవి వెంకట రాజారావును అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa