పాలకొండ అగ్నిమాపక కేంద్రం శిథిలావస్థకు చేరుకుంది. ఆదివారం అగ్నిమాపక కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పై నుండి పడుతున్న పెచ్చుల వలన ఇబ్బంది పడుతున్నారు. కనీస సౌకర్యాలు అయిన తాగు నీరు, మరుగుదొడ్లు లేక అవస్థలు పడుతున్నామని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేసారు. సంబంధిత అధికారులు అగ్నిమాపక కేంద్రాన్ని పరిశీలించి నూతన భవన నిర్మాణానికి కృషి చేయాలని కోరారు.