సీఐటీయూ మన్యం జిల్లా అధ్యక్షులు దావాల రమణారావుకు పోలీసులు ఆదివారం ముందస్తు నోటీసులు పాలకొండలో అందజేశారు. గొడుగుబిల్లి, శివ్వాం దళితుల న్యాయమైన భూసమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని, ఈనెల 29వ తేదీన వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘం పార్వతీపురం మన్యం జిల్లా కమిటీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు పోలీసులు ముందస్తు నోటీసులు అందజేశారు.