జామి మండల ఆర్యవైశ్యుల సంఘం అధ్యక్షులుగా కాపుగంటి రంజిత్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆర్యవైశ్యుల సంఘం మాజీ అధ్యక్షులు యిండుపూరి సుబ్బరాజు, విన్నకోట సీతారామయ్య తదితరులు ఆదివారం జామిలో అధ్యక్షులు రంజిత్ కుమార్, ప్రధాన కార్యదర్శి కుసుమంచి సురేష్, కోశాధికారి గాది రాముకు తమ అభినందనలు తెలిపారు. ఆర్యవైశ్యుల సంఘం అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో కాపుగంటి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.