సింహాచలం, వరాహ లక్ష్మీనృసింహస్వామికి ప్రత్యేక సందర్భాల్లో అలంకరణకు వినియోగించాలని కోరుతూ విశాఖ నగర పరిధిలోని మధురవాడ ప్రాంతానికి చెందిన భక్తుడు కె.సూర్యచంద్రరావు సోమవారం స్వర్ణ హారాన్ని బహూకరించారు. అధికారులు హారాన్ని తూకం వేసి 350 గ్రాములు ఉన్నట్టు నిర్ధారించారు. దేవస్థానం ఈఓ సింగాల శ్రీనివాసమూర్తికి సూర్యచంద్రరావు ఆ హారాన్ని అందజేశారు. ఆలయ ఆచారం ప్రకారం దాత కుటుంబ సభ్యులకు అధికారులు అంతరాలయంలో స్వామివారి దర్శనం కల్పించి, వారి గోత్రనామాలతో పూజలు జరిపించారు. గోదాదేవి అమ్మవారి దర్శనం తరువాత పండితులు వేదాశీర్వచనాలీయగా, ఆలయ ఏఈఓ ఆనందకుమార్ దాతను శాలువాతో సత్కరించి, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.