మైనర్లకు వాహనాలు ఇస్తే వాహనాలను సీజ్‌చేసి, కేసు నమోదుచేస్తామని విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాలతో నగరంలో సోమవారం డీఎస్పీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో సీ.ఐ రంగనాథ్, ఎస్.ఐలు లోవరాజు, రవి, త్రినాథరావు సిబ్బంది నగరంలోని ప్రధాన కూడళ్లలో తనిఖీలు నిర్వహించి మైనర్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, నంబరు ప్లేట్లు లేని 90 ద్విచక్రవాహనాలను స్టేషన్‌కు తరలించారు. సోమవారం సాయంత్రం తనిఖీల్లో పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ మైనర్‌లు డ్రైవింగ్‌కు పాల్పడితే అందుకు బాధ్యులుగా తల్లిదండ్రులు, సంబంధిత వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామ న్నారు. ఆటోడ్రైవర్లు వాహన రికార్డులను సక్రమంగా కలిగి ఉండాలన్నారు. పరిమితి కి మించి, ప్రయాణికులను అనుమతించవద్దన్నారు. ఈ సందర్భంగా లైసెన్స్, ట్రిపుల్ డ్రైవింగ్ వాహనాలు నడిపిన వ్యక్తులకు ఈ -చలాన్ విధించారు.