మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల దహనం కేసు రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మా రిందని ఎమ్మెల్యే షాజహానబాషా తెలిపారు. వారం రోజులుగా అసెంబ్లీలో ఏ ఎమ్మెల్యే తనను పలకరించినా ఇదే టాపిక్ అడుగుతున్నారన్నారు. మదనపల్లెలో వైసీపీ నాయకులు బీకేపల్లె హౌసింగ్ కాలనీలో పెద్దఎత్తున కబ్జాలు చేశారన్నారు. ఇక్కడ వైసీపీ నాయకుడు మనోహర్ ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలు చేపట్టాలంటే రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేశారని, మొత్తం రూ.6 కోట్లు ఈ విధంగా వసూలు చేశారని ఆరోపించారు. పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి బైపాస్‌రోడ్డు పక్క న విలువైన స్థలానికి సంబంధించి రాయచోటి కలెక్టరేట్‌లో తహసీల్దార్, సిబ్బంది కూర్చుని రాత్రికి రాత్రే ఆ భూమికి వన-బీ సృష్టించారన్నారు. ఈ భూమిని పెద్దిరెడ్డి సతీమణి స్వర్ణలత పేరుతో రిజిస్ట్రేషన చేశారన్నారు. బీకేపల్లె సర్వేనెంబర్-2లో విభజన కాకపోయినా, రికార్డులు సృష్టించి కాజేశారన్నారు. వలసపల్లె వద్ద 12 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అని అప్పటి జేసీ వినయ్‌చంద్ ఉత్తర్వులు ఇచ్చారన్నారు. కానీ ఆ భూమిని మాధవరెడ్డి కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. రింగ్ రోడ్డులో విద్యుత ఉద్యోగులకు చెందిన భూమిలో 10 కుంటల స్థలాన్ని మాధవరెడ్డి కబ్జా చేశారన్నారు. ములకలదిన్నె నుంచి యాతాలవంక వరకు 50 ఎకరాల డీకేటీ భూములను కబ్జా చేశారన్నారు. 596 జీవో అమలు కాకముందు పేదల వద్ద తక్కు వ ధరలకే డీకేటీ భూములు కొనుగోలు చేసి జీవో వచ్చాక కోట్లు దండుకున్నారన్నారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే మదనపల్లెను కబ్జాచేశారన్నారు. ఐదేళ్లలో గత ఎమ్మెల్యే, ఎంపీలు ఎవరైనా ఆ భూములను విక్రయించకుంటే వాటిని 22-ఏ జాబితాలో పెట్టించేస్తారన్నారు. 20 సర్వేనెంబర్లను 22-ఏలో పెట్టించారన్నారు. కలెక్టర్ గిరీషా వైసీపీ కార్యకర్తగా పనిచేశారన్నారు. వైసీపీ పాలనలో భూకబ్జాలపై ల్యాండ్‌గ్రాబింగ్ కేసులకు సిఫారసు చేస్తామన్నారు. మండలంలోనీ సీటీఎం-2 గ్రామంలో రెండు రోజుల పాటు ప్రజలతో సమావేశాలు నిర్వహించి అక్కడ జరిగిన అక్రమాలను వెలికి తీస్తామన్నారు. కాట్లటపల్లెలో వైసీపీ కౌన్సిలర్ల భూకబ్జాలను బయటపెడతామన్నారు. సమావేశంలో జనసేన నాయకులు పార్థసారథి, రామాంజనేయులు, టీడీపీ నాయకులు విద్యాసాగర్, ఎస్‌ఏ మస్తాన, షంషీర్, ఆర్‌జే వెంకటేశ, ఆర్‌కే రామకృష్ణాచారి, బాలుస్వామి, రెడ్డిస్వామి, నాగూర్‌వలి, సుధాకర్, చల్లా నరసింహులు తదితరులు పాల్గొన్నారు.