దళితులు, బీసీలు, పేద వర్గాల నుంచి వైసీపీ నేతలు పెద్ద ఎత్తున భూములు లాక్కున్నారని మదనపల్లె ఉదంతం నిరూపిస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విశాఖ, విజయవాడ, గుంటూరుతోపాటు ఉమ్మడి జిల్లాల ప్రధాన కేంద్రాల్లో బాధిత ప్రజల నుంచి విన్నపాలు స్వీకరించి విచారణ చేయాలని ఆదేశించారు. అయితే, కమిటీల పేరిట కాలయాపన చేస్తున్నారన్న సంకేతాలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, సీసీఎల్ఏ జయలక్ష్మి తదితర అధికారులు జిల్లాల్లో పర్యటించి ప్రజల విన్నపాలు స్వీకరించాలని సీఎం ఆదేశించారు.