ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వర్షాలు కురవాలని గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2024, 03:36 PM

హోళగుంద మండలం పెద్దహ్యట గ్రామంలో మంగళవారం వర్షాలు కురవాలని గ్రామ దేవతలైన శ్రీ బంగారమ్మ అవ్వ, కొల్లాపురం సుంకులమ్మదేవీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు గ్రామ చివరి బావి నుండి మేళ తాళాలతో బిందెలో నీళ్లు తెచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు. అనంతరం గ్రామ పెద్దలు మాట్లాడుతూ, సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు పండాలని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేయడం జరిగిందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com