శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలెం పంచాయతీలో నారాయణపురంలో అక్రమంగా మట్టితవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తుండడంతో అధికారులు సోమవారం దాడులు చేశారు. వివిధ గ్రామాలకు గ్రావెల్ తరలిస్తుండడంపై సమాచారం మేరకు ఇచ్‌చార్జి తహసీల్దార్ ఎం.చక్రవర్తి, మైన్స్ ఇన్స్‌పెక్టర్ మణిక్యాలరావు, ఎస్‌ఐ ఎస్.చిరంజీవులు తవ్వుతున్న స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా చక్రవరి మాట్లాడుతూ జేసీ ఆదేశాల మేరకు మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకుని ఎక్కడ త్వవకాలు జరుగుతున్నాయో తెలుసుకున్నామ న్నారు. ఆ స్థలం వద్దకు వెళ్లే సరికి ఆరు లారీలు, ఒక యంత్రం, రెండు ట్రాక్టర్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. త్వవకాలకు మైన్స్ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేవని చెప్పారు. తవ్వకం జరుగుతున్న భూమి ఎవరిదో వాహన యజ మానుల నుంచి వివరణ తెలుసుకుని వాస్తవ పరిస్థితిని జిల్లా అధికారులకు నివేదిస్తామని పేర్కొన్నారు.