ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీతో అంట కాగిన పలువురు డీఎస్పీలపై బదిలీ వేటు పడింది. తాడిపత్రి, రాజంపేటలో వైసీపీ కోసం పనిచేసిన డీఎస్పీ చైతన్యను బదిలీ చేశారు.తాడిపత్రిలో జేసీ ప్రభాకర రెడ్డి, ఆయన అనుచరులను డీఎస్పీ చైతన్య తీవ్రంగా వేధించారు.జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులపై దాడి చేశారని చైతన్యపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డీఎస్పీ చైతన్య కు పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.