ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2022 నవంబరు 28న నోటిఫికేషన్ విడుదలవగా.. గతేడాది జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు 4,58,219 మంది హాజరయ్యారు.ఏపీలో ఇటీవల ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఈ బాధ్యతలను చేపట్టింది. సాధ్యమైనంత త్వరగా నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు, పోలీసు నియామక మండలి ఛైర్మన్ పీహెచ్డీ రామకృష్ణ దీనిపై సమీక్షలు నిర్వహించారు. ఈ ఆగస్టు నెలాఖరులోగా నియామక ప్రక్రియ పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.