అనంతపురం జిల్లా కేంద్రంలోని పాత విద్యా శాఖ కార్యాలయంను ఏపీఈడబ్ల్యూఐడీసీ డీఈ రమణారెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఏసీ గోవింద నాయక్, కమిటీ సభ్యులు ఎంఈఓ 2 గురుప్రసాద్, డీసీఈబీ సెక్రెటరీ పురుషోత్తం బాబులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పైకప్పు, మరుగుదొడ్లు, పార్కింగ్ టైల్స్, కలర్స్, వై రింగ్స్, తదితర మరమ్మత్తులు కోసం అంచనాల తయారుచేసి వెంటనే అందజేస్తామని డీఈ అధికారులకు తెలిపారు.