అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు గంబూషియా చేపలు ఎంతో దోహదపడతాయని, దోమల నివారణలో కీలకపాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆయన మంగళవారం 35 వేల గంబూ షియా చేపలను 13 నీటినిలువ కేంద్రాలలో వదిలే కార్యక్రమాన్ని, రాయదుర్గం పట్టణంలోని పాలబావి లో ఫాగింగ్ యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... బ్యాక్టీరి యా వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా గంబూషియా చేపలను వదు లుతున్నామన్నారు. ప్రజలు అంటువ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. దోమల లార్వా వృద్ధిచెందే నీటినిల్వ కేంద్రాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించారు. మలేరియా అధికారి నాగేంద్ర, మున్సిపల్ కమిషనర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆయన పట్టణంలోని బస్టాండ్ వద్ద అన్న క్యాంటిన కోసం నిర్మిస్తున్న భవనా న్ని పరిశీలించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సకాలంలో అన్న క్యాంటినను ప్రారంభించి, పేదలకు కడుపునిండా భోజనం పెట్టాలనే తమ లక్ష్యాన్ని నెరవేరుస్తామని ఎమ్మెల్యే తెలిపారు.