రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీసత్యసాయి జిల్లా పర్యాటన ఖరారైంది. ఆగస్టు1న మడకశిర మండలం గుండుమలలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. గురువారం నంద్యాల జిల్లాలో పర్యటన ముగించుకుని శ్రీశైలం సున్నిపెంట నుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 1.45కి గుండుమల ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 2.15కి హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గాన గుండుమలకు చేరుకుంటారు. 2.20కి గుండుమలలో ఇంటి వద్ద ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. అనంతరం మల్బరీ ప్లాంటేషన షెడ్‌ను సందర్శించి పట్టు రైతులతో మాట్లాడతారు. 3.20కి గుండుమలలో కరియమ్మదేవి దేవాలయాన్ని సందర్శించి 3.25 నుంచి 4.25 దాకా గ్రామ ప్రజలతో ప్రజావేదిక కార్యక్రమంలో ముఖాముఖీ నిర్వహిస్తారు. 4.25 గుండుమల నుంచి బయల్దేరి పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయం చేరుకుంటారు. 5.05కు ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరి వెళ్తారు.