బీహార్‌లోని సుపౌల్ జిల్లాలోని లాల్‌పత్తిలో ఐదేళ్ల బాలుడు మరో బాలుడిపై కాల్పులు.ప్రైవేట్ పాఠశాలలో నర్సరీ విద్యార్థి (5) బుధవారం తన బ్యాగులో ఓ హ్యాండ్ గన్ పెట్టుకుని పాఠశాలకు వెళ్లాడు. అదే బడిలో మూడో తరగతి చదువుతున్న పదేండ్ల బాలుడిపై కాల్పులు జరిపాడు. ఆ బాలుని చేతికి గాయమైంది. బాలుడిని వెంటనే దవాఖానకు తరలించారు. ఈ బాలుని వద్దకు తుపాకీ ఎలా వచ్చింది? దానిని పాఠశాలకు ఏ విధంగా తీసుకురాగలిగాడు? అనే అంశాలపై దర్యాప్తు జరుగుతున్నది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa