ప్రజల నుంచి వినతులు స్వీకరించి.. వారి సమస్యలు ఓపికగా వింటూ.. వారికి స్వాంతన కలిగించే కార్యక్రమం ప్రజాదర్బార్.
ఈ క్రమంలో కీలక నాయకులు సహా మంత్రులకు కూడా `ప్రజాదర్బార్ డ్యూటీలు` వేశారు.మొక్కుబడిగా ప్రజలను కలుసుకోవడం కూడా కాదు.విధిగా ఉదయం 7 గంటల కల్లా నిర్ణీత డ్యూటీలో ఉన్న మంత్రులు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి ప్రజలను కలుసుకోవడంతోపాటు.. ప్రజాదర్బార్‌లో పాల్గొనాలని కూడా.. చంద్రబాబు ఆదేశించారు.తద్వారా ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయని కూడా చెతున్నారు. ఈ క్రమంలో తొలిసారి ఆగస్టు నెలకు సంబంధించి మంత్రులకు ప్రజాదర్బార్ డ్యూటీలు వేశారు.
ఆగస్టు నెలలోడ్యూటీలు ఇలా..
1వ తేదీ: పర్చురి అశోక్‌బాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా.
2వతేదీ: మంత్రి గొట్టిపాటి రవికుమార్, టీడీపీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ యాదవ్.
3వ తేదీ: సీఎం చంద్రబాబు, టీడీపీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ యాదవ్.
4వ తేదీ: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, బొల్లినేని రామారావు.
5వ తేదీ: మంత్రి వంగలపూడి అనిత, బీద రవిచంద్ర యాదవ్.
6వ తేదీ: మంత్రి పొంగూరు నారాయణ, మాజీ మంత్రి జవహార్
7వ తేదీ: మంత్రి నిమ్మల రామానాయుడు, టీడీపీ ఏపీ చీఫ్ పల్లా
శ్రీనివాస్ యాదవ్.
8వ తేదీ: సీఎం చంద్రబాబు, పల్లా శ్రీనివాస్ యాదవ్.
9వ తేదీ: మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి, వర్ల రామయ్య.
10వ తేదీ: మంత్రి టీ.జీ. భరత్, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి.
11వ తేదీ: మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. కిషోర్ కుమార్ రెడ్డి.
ఏం చేస్తారు?
+ ప్రజల నుంచి సమస్యలు వింటారు.
+ తక్షణం పరిష్కారం అయ్యేవాటికి పరిష్కారం చూపుతారు.
+ ముఖ్యమంత్రి ఆర్థిక సాయం కోరే వారి జాబితాను రెడీ చేస్తారు. + దీనికి సంబంధించిన పత్రాలు సేక రిస్తారు. + ఆర్థికేతర అంశాలను తక్షణమే పరిష్కరించే ప్రయత్నం చేస్తారు.
+ సివిల్ వివాదాల జోలికి పోరు.
+ న్యాయపరమైన అంశాలపై సలహాలు ఇచ్చేందుకు టీడీపీ లీగల్ సెల్‌కు సిఫార్సు చేస్తారు
+ రూ.10 లోపు ఆర్థిక సాయం కోరే వారి విషయంలో తక్షణ నిర్ణయం తీసుకుంటారు.
+ ప్రధానంగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య
వారధులుగా పనిచేస్తారు