దేశ రాజధాని ఢిల్లీలో వాన దంచికొట్టింది. కుండపోతగా కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయ్యాయి. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉన్నది.సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ అబ్జర్వేటరీలో కేవలం ఒక గంట వ్యవధిలో 11.25 సెంటీమీటర్ల వర్షంపాతం నమోదయింది. భారీ వానలతో నగరంలోని పలుచోట్ల నడుములోతు నీరు నిలిచిపోయింది. రోడ్లన్నీ జలమయమవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది.ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానలతో స్కూళ్లు, విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు.రాబోయే 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.