కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో విపక్షనాయకుడు రాహుల్ గాంధీ వయనాడులో పర్యటించనున్నారు.ఢిల్లీ నుంచి వరద బాధిత వయనాడుకు ఆయన బయల్దేరారు. కొండచరియలు విరిగిపడి ఘటన, వరద బాధితులను పరామర్శించనున్నారు.ప్రకృతి ప్రకోపానికి వయనాడ్ మరుభూమిగా మారిపోయింది. శిథిలాలను తొలగించిన కొద్దీ మృతదేహాలు బయట పడుతున్నాయి. చలియార్ నదిలో శవాలు కొట్టుకొస్తూనే ఉన్నాయి.కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో ఇప్పటివరకు 270 మృతదేహాలు లభ్యమయ్యాయి. చలియార్ నదిలో కొట్టుకువచ్చిన 83 మృతదేహాలను బయటకు తీశారు.దాదాపు 500 ఇండ్లు పూర్తిగా వరదలో కొట్టుకుపోయాయని స్థానికులు చెప్తున్నారు. దీంతో, మృతులు, గల్లంతైన వారి సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది.కాగా, జులై 30 ఉదయం నుంచి కేరళ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని రెస్క్యూ ఆపరేషన్స్ చీఫ్ మేజర్‌జనరల్ మ్యాథ్యూ అన్నారు.ప్రస్తుతం గాలింపు కొనసాగుతున్నదని, డాగ్ స్క్వాడ్‌తోపాటు 5 వందలకుపైగా ఆర్మీ సిబ్బంది ఇందులో పాలుపంచుకుంటున్నారని వెల్లడించారు