అన్న క్యాంటీన్, మహిళలకు ఉచిత బస్సుపై ఏపీ మంత్రి బాల వీరాంజనేయస్వామి కీలక ప్రకటన చేశారు. త్వరలో అన్న క్యాంటీన్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజాకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని వెల్లడించారు. పనిచేసే ప్రభుత్వంపై విమర్శలు సరికాదని వివరించారు. సామాజిక భద్రతా పించన్లు ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు. తల్లికి వందనం పథకంపై వైసీపీ తప్పుడు ప్రచారం సిగ్గుచేటు అంటూ నిప్పులు చెరిగారు.