మంత్రాలయం మండలం మాధవరం గ్రామ శివారులోని గురు రాఘవేంద్ర స్టేజ్ - 1 ను గుర్తు తెలియని వ్యక్తులు హై ఓల్టేజ్ మోటార్లను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ యువనేత ప్రదీప్ రెడ్డి, వైసీపీ నేతలు భీమారెడ్డి గురువారం పంప్ హౌస్ ను పరిశీలించారు. రైతుల సంక్షేమం నిమిత్తం మోటారు మరమ్మతులకు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తరుపున రూ. 5 లక్షలు అందజేస్తామని హామీ ఇచ్చారు.