రాజుపాలెం మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గత మే నెల 19 తేదీ నుంచి ఇప్పటి వరకు పనిచేసిన దినాలకు డబ్బులు అందలేదని కూలీలు వాపోతున్నారు. డబ్బులు పడతాయన్న ఆశతో ఉపాధి కూలీలు గ్రామాల్లోని తపాలా కార్యాలయం, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. మండలంలో 15 గ్రామపంచాయతీలకు గాను దాదాపు రూ. 50 లక్షల నుంచి రూ. 60 లక్షలకు పైబడి బిల్లులు రావాల్సి ఉందని గురువారం ఏపీవో లక్ష్మీనారాయణ తెలిపారు.