ప్రభుత్వం చేపట్టిన ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీకార్యక్రమం గురువారం వేంపల్లెలో ప్రారంభమైందని రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షబ్బీర్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వేంపల్లెలో అర్హులైన వృద్ధులకు రూ. 4వేలు వికలాంగులకు రూ. 6వేలు చొప్పున పింఛన్లు పంపిణీ చేశామని తెలిపారు. రూ. 200 ఉన్న పింఛను రూ. 1000 చేసి తర్వాత రూ. 3వేలు నుంచి రూ. 4వేలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.