ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను ప్రతి నెల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేసి హామీని నెరవేర్చిందని పులివెందుల ఇన్ ఛార్జ్ బీటెక్ రవీంద్ర నాథ్ రెడ్డి అన్నారు. గురువారం వేంపల్లెలోని శ్రీరాం నగర్ పింఛన్లు పంపిణీ చేశారు. టీడీపీని ఆదరించాలని కోరారు. ప్రతి నెల పింఛన్ ను సీఎం చంద్రబాబు నాయుడు రూ. 4 వేలు ఇస్తున్నట్లు చెప్పారు. మందు నెల ఒకేసారి రూ. 7 వేలు ఇచ్చామన్నారు. టిడిపి నాయకులు పాల్గొన్నారు.