ఎస్సీ వర్గీకరణకై మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 30 సంవత్సరాల పాటు సాగిన పోరాటానికి ఫలితం నేడు సుప్రీంకోర్టు తీర్పే అని ఎంఎస్పి జిల్లా సీనియర్ నాయకులు జయరాం మాదిగ, మరియన్న మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు విజయభాస్కర్ మాదిగ లు పేర్కొన్నారు. గురువారం కాజీపేటలో వారు మాట్లాడుతూ. లక్ష్యసాధనలో వెనుకకు చూడకుండా, ఎన్నో ఆటుపోట్లు, అవకాశాలను లెక్క చేయకుండా పోరాటం సాగించిన కృష్ణ మాదిగ కు కృతజ్ఞతలు తెలిపారు.