పొందూరు మండలంలోని కనిమెట్ట గ్రామంలో గురువారం ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పంపిణీ కార్యక్రమంలో ఆముదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే రవికుమార్ స్వయంగా అవ్వాతాతలకు పెన్షన్లు అందించారు. ఆయనతోపాటు ఆమదాలవలస తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు తాడి బోయిన చంద్రశేఖర్ యాదవ్ మరియు మండల తెదేపా నాయకులు, కార్యకర్తలు , మహిళలు , యువత పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.